భారతదేశం, నవంబర్ 20 -- రాష్ట్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మెుదలైంది. కోటి మందికి కోటి చీరలు అని ప్రభుత్వం చెబుతోంది. రెండు దశల్లో ఈ చీరల పంపిణీ చేయనున్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(SERP) కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కీలక విషయాలను వెల్లడించింది. ఈ కార్యక్రమాన్ని ఓ పండుగ వాతావరణంగా చేయాలని ప్రభుత్వం చూస్తోంది.

మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు అర్హులైన ఇంటింటికీ వెళ్లాలి. బొట్టి పెట్టి మరీ చీరలను లబ్ధిదారులకు అందజేయాలని సెర్ప్ స్పష్టం చేసింది. మెుదట మండల స్థాయిలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు పూర్తయిన తర్వాతనే గ్రామాల్లో పంపిణీ మెుదలుపెట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇందుకోసం సబ్‌కలెక్టర్లు, ఆర్డీఓలు పర్యవేక్షలుగా ఉంటారు.

లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ కార్డ...