Hyderabad, సెప్టెంబర్ 21 -- టాలీవుడ్‌ యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. రన్ రాజా రన్, శతమానం భవతి, మహానుభావుడు, ఒకే ఒక జీవితం, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు వంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. గతేడాది హీరోయిన్ కృతి శెట్టితో శర్వానంద్ జోడీ కట్టిన సినిమా మనమే అంతంత మాత్రంగానే టాక్ తెచ్చుకుంది.

ఒక మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్న శర్వానంద్ తన కెరీర్‌లో 36వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన 36వ మూవీలో స్కిల్డ్ మోటార్ సైకిల్ రేసర్‌గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక శర్వానంద్ 36వ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శర్వానంద్, రేస్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తు...