Hyderabad, ఏప్రిల్ 25 -- ఏప్రిల్, మే నెలలో ఎన్నో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. మీకు తెలిసిన వారు ఎంతోమంది పెళ్లికి సిద్దమవుతారు. వారి పెళ్లికి మీరు ఉత్త చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది? వారు జీవితాంతం గుర్తుండిపోయేలా మంచి బహుమతిని తీసుకువెళ్లాల్సిందే. మేము వివాహ బహుమతుల కోసం ఎలాంటి వస్తువులు ఇస్తే ఉత్తమంగా ఉంటుందో ఇక్కడ వివరించాము. మీ బడ్జెట్లోనే కొత్త జంట ఉపయోగించుకునేలా మీరు మంచి బహుమతిని అందించాలనుకుంటే కింద చెప్పిన ఐడియాలలో ఏదో ఒకటి ఫాలో అవ్వండి.

పెళ్లయిన జంటలకు కచ్చితంగా ఇంట్లో ఎన్నో వస్తువులు అవసరం. వారు ఏ వస్తువులు వాడే అవకాశం అధికంగా ఉంటుందో ఆలోచించి అలాంటివి కొనండి. ఇంటిలో మిక్సీ ఉండాల్సిందే. మిక్సీ ఇస్తే దాన్ని మూలన పడేయకుండా కచ్చితంగా వాడుతారు. కాబట్టి మిక్సీ కూడా మీకు 1500 రూపాయల నుంచి 3000 రూపాయల లోపే వచ్చేస్తుంది. ఇది కూడా బడ్జెట...