Hyderabad, సెప్టెంబర్ 1 -- ప్రతి ఏటా దుబాయ్‌లో జరిగే గామా (గల్ఫ్ అకాడెమీ మూవీ అవార్డ్స్) వేడుక ఈసారి కూడా ఘనంగా జరిగింది. ఆదివారం (ఆగస్టు 31) రాత్రి జరిగిన ఈ అవార్డుల వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు సందడి చేశారు. ఇక ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా మీనాక్షి చౌదరి అవార్డులను అందుకున్నారు. పుష్ప 2 మూవీ అన్ని ప్రధాన అవార్డులను దక్కించుకుంది. బెస్ట్ యాక్టర్, బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డులు దక్కాయి.

ఇప్పటికే నాలుగేళ్లుగా గామా అవార్డులను ప్రదానం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ వేడుక ఘనంగా జరిగింది. గామా అవార్డ్స్ ఛైర్మన్ కేసరి త్రిమూర్తులు, సీఈఓ సౌరభ్ కేసరి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా అత్యంత వైభవంగా ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు.

గామా అవార్డ్స్ 2025 జ్యూరీ ఛైర్ పర్సన్స్ ప్రముఖ సి...