Hyderabad, సెప్టెంబర్ 4 -- టాలీవుడ్ సీనియర్ హీరో, నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి. జీ తెలుగు, జీ5 ఓటీటీ అందిస్తున్న ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్‌కు గెస్టులుగా సెన్సేషనల్ డైరెక్టర్స్ రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా హాజరయ్యారు.

దీనికి సంబంధించిన ప్రోమోలను ఒక్కొక్కటిగా యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో విడుదల చేసిన జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి ప్రోమోలో పంచ్‌లు ట్విస్టులు, నవ్వులతో చాలా ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. "జగపతి బాబు పేరు సాలిడ్‌గా రిజిస్టర్ అయింది గాయం సినిమాతో" అని జగపతి బాబు అంటే "నువ్వు నన్ను పొగిడినంత మాత్రాన నేను నిన్ను పొగడను" అని ఆర్జీవీ అన్నారు.

"నేను నిన్ను పొగడలా ఇప్పుడు" అని జగపతి బాబు అంటే.. "ఇది పొగడ్త కాదు అంటేనే అది పొగడ్త" అని కౌంటర్ వేశారు ర...