భారతదేశం, మే 26 -- తెలంగాణ గాన కోకిల.. బెల్లి లలిత. నిరుపేద కూలీ కుటుంబంలో పుట్టినా.. ఆలోచన పెద్దది. పీడిత ప్రజల కోసం పోరాటం చేసింది. తన పాటతో ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చింది. తెలంగాణ కళాసమితిని స్థాపించి.. ఎన్నో ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమూ పోరాడింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో లలితకు విశేషమైన ప్రజాదరణ వచ్చింది. ఆ ప్రజాదరణను చూసి.. నాటి పాలకులు వణికిపోయారు. తమకు అడ్డొస్తుందని అంతమొందించారనే ఆరోపణలు ఉన్నాయి.

బెల్లి లలిత 1974 ఏప్రిల్ 29న భువనగిరిలో నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఆమె చదువుకోలేదు. పొట్టకూటి కోసం స్థానిక కాటన్ స్పిన్నింగ్ మిల్లులో కార్మికురాలిగా చేరింది. ఆ సమయంలోనే సీఐటీయూలో సభ్యత్వం తీసుకొని.. కార్మికుల హక్కుల కోసం పోరాడింది. ఆ తరువాత భువనగిరి సాహిత్య మిత్ర మండలిలో చేరి.. ప్రజా సమస్యల...