Hyderabad, జూలై 21 -- సినీ ఇండస్ట్రీలో ఎంట్రీలు, రీ ఎంట్రీలు సాధారణమే. ఇది ఎక్కువగా హీరోయిన్స్‌లలో జరుగుతుంది. స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న తర్వాత భర్త, కుటుంబం, పిల్లలు అంటూ సినిమాలకు దూరంగా ఉంటారు. తర్వాత ఒక సమయంలో మళ్లీ కీలక పాత్రలతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారు.

ఇలా రీసెంట్‌గా తెలుగులో ముగ్గురు సీనియర్ హీరోయిన్స్ రీ ఎంట్రీ ఇచ్చారు. వారే జెనీలియా, లయ, అన్షు. ఈ ముగ్గురు సీనియర్ ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. మన్మథుడు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన అన్షు ఆ తర్వాత ప్రభాస్‌తో రాఘవేంద్ర చేసింది. అనంతరం భూమిక మిస్సమ్మ మూవీలో కెమియో చేసింది.

కేవలం ఈ రెండు, మూడు సినిమాలు చేసిన అన్షు తన బ్యూటీతో చాలా ఫేమ్ తెచ్చుకుంది. పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లిపోయిన అన్షు మజాకా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. సందీప్ కి...