భారతదేశం, మే 16 -- విజయవాడ ఇంద్రకీలాద్రి.. ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. కానీ ఇప్పుడు దోపిడీకి కేంద్రంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ వ్యాపారులు, సిబ్బంది భక్తుల జేబులకు చిల్లు పెడుతున్నారు. కొండపైకి ఎక్కడం మొదలు.. కిందకు దిగే వరకు.. ప్రతీచోట డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అమ్మవారి కొండపైకి వెళ్లడానికి ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. కానీ.. అవి సరిపడా లేవు. ఎప్పుడో వస్తున్నాయి. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో.. భక్తులు వేడికి తాళలేక.. ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వారధి కింద నుంచి కొండపైకి వెళ్లడానికి సెవెన్ సీటర్ వాహనాలను నడుపుతున్నారు. వీటిల్లో ఎక్కించడానికి అక్కడ విధులు నిర్వహించే ఆలయ సిబ్బంది సహకరిస్తున్నారు. అటు ఘాట్ రోడ్డు ప్రారంభంలో ఉండే సిబ్బంది కూడా.. భక్తుల వాహనాలకు ఆ...