భారతదేశం, నవంబర్ 15 -- బెంగుళూరు నగరంలో ఆస్తుల రికార్డుల వ్యవస్థను సమూలంగా మారుస్తూ.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శనివారం ఒక కీలకమైన డిజిటల్ సంస్కరణను ప్రకటించారు. ఇది "ఈ-ఖాటా విప్లవానికి" నాంది పలుకుతుందని, దీని ద్వారా మధ్యవర్తులు లేకుండా పోతారని, అనుమతులు వేగవంతం అవుతాయని, అలాగే మొత్తం ఖాటా ప్రక్రియ పూర్తిగా ఫేస్‌లెస్, ఆన్‌లైన్ అవుతుందని ఆయన పేర్కొన్నారు.

ఎక్స్​ (ట్విట్టర్) వేదికగా శివకుమార్ పంచుకున్న పోస్ట్ ప్రకారం, నివాసితులు ఇకపై ఏ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే, బీబీఎంపీ ఈ-ఆస్తి పోర్టల్ ద్వారా లేదా బెంగుళూరు వన్ కేంద్రాల్లో డిజిటల్‌గా ఈ-ఖాటా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అవినీతి, జాప్యం, వేధింపులపై దీర్ఘకాలంగా ఉన్న ఫిర్యాదులకు ముగింపు పలకడమే ఈ చర్యకు ప్రధాన లక్ష్యమని డీకే శివకుమార్​ తెలిపారు.

ఇప్పటికే 25 లక్షల ...