భారతదేశం, జనవరి 12 -- బెంగళూరు: నగరంలోని రామ్మూర్తి నగర్‌లో వారం రోజుల క్రితం జరిగిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి కేసులో పోలీసులు సంచలన నిజాలు బయటపెట్టారు. మొదట అగ్నిప్రమాదంగా భావించిన ఈ ఘటన.. పక్కా ప్లాన్‌తో జరిగిన హత్య అని తేల్చారు.

మంగళూరుకు చెందిన 34 ఏళ్ల షర్మిల, బెంగళూరులోని యాక్సెంచర్ (Accenture) ఐటీ సంస్థలో పనిచేసేవారు. జనవరి 3న ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగ కారణంగా ఆమె మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా భావించారు. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అంతా నమ్మారు. "మొదటి చూపులో అది ముమ్మాటికీ ప్రమాదంలాగే కనిపించింది, ఎక్కడా అనుమానాస్పద ఆనవాళ్లు లేవు" అని రామ్మూర్తి నగర్ ఇన్‌స్పెక్టర్ జి.జె. సతీష్ పేర్కొన్నారు.

కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. నిం...