భారతదేశం, జనవరి 11 -- నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) బెంగళూరు-కడప-విజయవాడ ఆర్థిక కారిడార్(NH-544G) అమలులో నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లను విజయవంతంగా సృష్టించింది. ఇది నేషనల్ హైవేస్ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని తెలియపరుస్తుంది.

జనవరి 6, 2026న అధికారిక విడుదల ప్రకారం, ఎన్‌హెచ్ఏఐ పుట్టపర్తి సమీపంలో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లను సృష్టించింది. మొదటిది 24 గంటల వ్యవధిలో 28.89 కి.మీ తారు రోడ్డు నిర్మించడం. రెండో రికార్డు 24 గంటల్లో అత్యధికంగా 10,655 మెట్రిక్ టన్నుల బిటుమినస్‌ కాంక్రీట్‌ (కంకర, తారు) వేయడం. ఎకనామిక్ కారిడార్‌లో ఆరు-లేన్ల జాతీయ రహదారి ప్రాజెక్ట్ కింద రెండు రికార్డులు మొదటిసారిగా నమోదు అయ్యాయి.

ఇదే ఊపు మీద జనవరి 11, 2026న మరో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లు క్రియేట్ అయ్యాయి. దీనితో మెుత్తం నాలుగు గిన్నిస్ వరల్డ్ రిక...