భారతదేశం, మార్చి 27 -- ఏప్రిల్ 1 నుంచి బెంగళూరు ఎయిర్ పోర్ట్ రోడ్డులో ప్రయాణించడం కాస్త ఖరీదైనదిగా మారుతుంది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి లేదా బెంగళూరు శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్‌లో ప్రయాణిస్తే టోల్ ఛార్జీల భారం పెరగనుంది. వార్షిక రుసుము సవరణ రోడ్డు వినియోగదారులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అదేవిధంగా సరుకు రవాణా, ప్రజా రవాణా మొదలైన వాటిపై డ్యూటీ భారం అంతిమంగా ప్రజలపై పడుతుంది.

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) టోల్ రేట్లను సవరించి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఎన్‌హెచ్ 7లో ఎయిర్‌పోర్ట్ రోడ్డులోని సదహళ్లి టోల్ ప్లాజా, ఎన్హెచ్-648లోని హులికుంటె, నల్లూరు దేవనహళ్లి టోల్ ప్లాజాలకు కూడా ఈ సవరణ వర్తిస్తుందని డెక్కన్ హెరాల్డ్ ఒక రిపోర్ట్‌లో తెలిపింది.

సదహళ్లి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, ఇతర తేలికపాటి ...