భారతదేశం, సెప్టెంబర్ 3 -- ఫస్ట్ మలయాళ ఫీమేల్ సూపర్ హీరో మూవీగా తెరకెక్కిన 'లోకా: చాప్టర్ 1-చంద్ర' థియేటర్లలో అదరగొడుతోంది. రికార్డుల వేటలో సాగిపోతోంది. ఈ మూవీపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. కానీ ఒక్క డైలాగ్ మాత్రం కాంట్రవర్సీకి కారణమైంది. కన్నడ వాసుల మనోభావాలను దెబ్బతీసింది. దీంతో లోకా మూవీ ప్రొడ్యూసర్ దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ హౌస్ సారీ చెప్పాల్సి వచ్చింది.

లోకా: చాప్టర్ 1-చంద్ర సూపర్ హీరో సినిమాలోని ఒక డైలాగ్ లైన్ మినహా అన్నింటికీ ప్రశంసలు అందుకుంటోంది. పలువురు కన్నడిగులు ఈ చిత్ర నిర్మాత దుల్కర్ సల్మాన్ తో పాటు మిగతా టీంను సోషల్ మీడియా ద్వారా నిలదీయడంతో ఆయన నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిలిమ్స్ క్షమాపణలు చెప్పింది. లోకా చిత్రంలో విలన్, ఇన్ స్పెక్టర్ నాచియప్ప గౌడగా శాండీ నటించాడు. ఈ మూవీలో అతని క్యారెక్టర్ అమ్మాయిలను ద్వేషిస్తుంటోంద...