భారతదేశం, మే 7 -- ఇంద్రజ, అజయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సీఎం పెళ్లాం మూవీ మే 9న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. బొల్లా రామకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ మూవీకి గడ్డం రమణారెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమా రిలీజ్‌ను పుర‌స్క‌రించుకొని మేక‌ర్స్ ఇటీవ‌ల పాత్రికేయుల స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ ''ఎమ్మెల్యే.. సీఎం అవుతాడు. ఎలక్షన్లు రాగానే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే వ్యక్తే కాకుండా ఆయన సతీమణి ఓట్లు అడగడం తెలిసిందే. కానీ గెలిచాక ఎంతమంది తమ ఇంటికి వచ్చిన ఓటర్లను కలుస్తున్నారు అనే పాయింట్‌ను ఈ సినిమాలో చ‌ర్చిస్తున్నాం అన్నారు,.

ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో వైరస్ వ్యాధి కన్నా మించింది బుూతు. మీడియా ముందుకు వచ్చి రాజకీయ నాయకులు బుూతులు మాట్లాడకూడదన్న పాయింట్‌ను ఈ సినిమా ద్వారా బయటపెడుతున్నా. రాజకీయ నాయకులు మ...