భారతదేశం, నవంబర్ 7 -- మచ్​ అవైటెడ్​ బుల్లెట్​ 650ని ఇటీవలే ఆవిష్కరించింది రాయల్​ ఎన్​ఫీల్డ్​. దీనితో ఇన్నాళ్లకు ఐకానిక్ బుల్లెట్​ పేరు.. బ్రాండ్​కి చెందిన 650 సీసీ ట్విన్-సిలిండర్ ఫ్యామిలీలోకి చేరింది. ఇది ఇప్పటికే ఉన్న ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ జీటీ, సూపర్ మెటియార్, షాట్‌గన్ 650, ఇటీవల విడుదలైన క్లాసిక్​ 650 వంటి మోడళ్లతో చేరింది. ఈ నేపథ్యంలో క్లాసిక్​ 650తో బుల్లెట్​ 650ని పోల్చి, ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటి? ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకోండి..

క్లాసిక్​ 650 అనేది.. క్లాసిక్ 350కి చెందిన స్మూత్​ లైన్స్, టియర్​డ్రాప్​ ట్యాంక్​, క్రోమ్-యాక్సెంట్ టచ్‌లను వారసత్వంగా పొందింది. ఈ బైక్ ఆకర్షణీయంగా, టైమ్‌లెస్ ఫీలింగ్‌ను ఇస్తుంది. వల్లమ్ రెడ్, బ్రంటింగ్‌థోర్ప్ బ్లూ, టీల్ గ్రీన్, బ్లాక్ క్రోమ్ వంటి రంగులు దీనికి రిచ్, పరిణతి చెందిన రూపాన్ని...