భారతదేశం, ఫిబ్రవరి 7 -- టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీధర్ గౌడ్, సీనియర్ నటి సుధ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'వెంకట్రామయ్య గారి తాలూకా'. 'జయమ్మ పంచాయతీ' మూవీ ఫేమ్ దినేష్ కుమార్ హీరోగా, ఈటీవీ ప్రభాకర్ (బుల్లితెర మెగాస్టార్) కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా నటించారు.

తండ్రి, పిల్లల మధ్య భావోద్వేగాల నేపథ్యంలో వారి వారి బాధ్యతలను తెలియజేసేలా రూపొందిన ఈ సినిమాను డైరెక్టర్ సతీష్ ఆవాల తెరకెక్కిస్తున్నారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంలో సాగే క్యూట్ లవ్‌స్టోరీతో పాటు ఫాదర్ సెంటిమెంట్ ప్రధానంగా ఉండనుంది. ఈ చిత్రంలో సీనియర్ దర్శకుడు, రచయిత, నటుడు యనమదల కాశీ విశ్వనాథ్, మిర్చి మాధవి, జబర్దస్త్ ఫేమ్ సత్యశ్రీ, మొగలిరేకులు సీరియల్ ఫేమ్ ఇక్బాల్, జీవన...