Hyderabad, ఆగస్టు 8 -- కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి తెలిసిందే. హీరోగానే కాకుండా సింగర్‌గా, డైరెక్టర్‌గా, నిర్మాతగా మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నాడు. రీసెంట్‌గా కుబేర సినిమాలో తన నటనతో యావత్ సినీ ఆడియెన్స్‌తో చప్పట్లు కొట్టించుకున్న ధనుష్ కథ, దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరించిన సినిమా జాబిలమ్మా నీకు అంత కోపమా.

థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న జాబిలమ్మా నీకు అంత కోపమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు భాషలో జాబిలమ్మ నీకు అంత కోపమా ఓటీటీ రిలీజ్ అయింది. ఓటీటీ రిలీజ్ అయిన కొన్ని రోజులు ట్రెండింగ్‌లో కూడా నిలిచింది జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ.

ఇప్పుడు జాబిలమ్మ నీకు అంత కోపమా టీవీ ప్రీమియర్ కానుంది. అంటే, బుల్లితెరపై సందడి చేసేందుకు జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ సిద్ధంగా ఉంది. వివిధ టీవీ షోలు, సీరియల్స్‌తో మంచి క్...