Hyderabad, అక్టోబర్ 3 -- వారం వారం సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న టీవీ ఛానెల్ జీ తెలుగు. అయితే, జీ తెలుగు ఈ దసరా పండగ సందర్భంగా సూపర్ హిట్ సినిమాతో మీ ముందుకు రానుంది. థియేటర్, ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న సెన్సేషనల్ మూవీ 'ఓదెల 2'.

2022లో ఓటీటీ వేదికగా అలరించిన 'ఓదెల రైల్వేస్టేషన్​' సినిమాకి సీక్వెల్‌​గా రూపొందిన ఓదెల 2 టీవీ ప్రీమియర్ కానుంది. జీ తెలుగు టీవీ ఛానెల్‌లో ఈ ఆదివారం (అక్టోబర్​ 5) ఓదెల 2 సినిమా ప్రసారం కానుంది. అక్టోబర్ 5న జీ తెలుగులో మధ్యాహ్నం 3 గంటలకు ఓదెల 2 చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.

ఓదెల 2 కథలోకి వెళితే.. ఓదెల గ్రామంలో అనేక దారుణాలు చేసిన తిరుపతి (వశిష్ఠ)ని ఆ గ్రామస్థులు సమాధి చేసిన ఆరు నెలలకే మళ్ళీ ఒక భయంకర ఆత్మగా బయటకి వస్తాడు. అలా వచ్చి మళ్లీ ఓదెలలో మరింత విధ్వంసం సృష్టిస్తాడు. అతడిని కట్టడి చేసే...