Hyderabad, ఆగస్టు 27 -- బుధవారం నాడు వినాయకుడి పూజించడం వలన సంతోషం కలుగుతుంది, వినాయకుని ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. వినాయకుడిని ఆరాధించడం వలన జీవితంలో ఉన్న కష్టాలు కూడా తొలగిపోతాయి, సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది. అయితే, బుధవారం నాడు వినాయకుడిని పూజించేటప్పుడు కొన్ని పరిహారాలను పాటించడం మంచిది. ఇలా చేయడం వలన గణపతి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండవచ్చు. వినాయకుడి ఆశీస్సులతో ఏ ఇబ్బందులున్నా తొలగిపోతాయి.

ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న వారు బుధవారం నాడు వినాయకుడిని పూజించి 21 గరికలను, సింధూరాన్ని సమర్పించండి. దీంతో వినాయకుని ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది. అదే విధంగా 108 సార్లు "ఓం గం గణపతయే నమః" మంత్రాన్ని పఠిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. వినాయకుని అనుగ్రహంతో కష్టాలన్నీ తొలగిపోతాయి, మీరు చేపట్టే పనులైనా సరే విఘ్నాలు లేకుండా పూర్తవుతాయి. ఇలా చేయడం ...