Hyderabad, మే 15 -- ఎప్పుడో ఐదేళ్ల కిందట వచ్చిన అల వైకుంఠపురంలో మూవీలోని సాంగ్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో మనందరికీ తెలుసు. అందులోని బుట్టబొమ్మ సాంగ్ అయితే మరో లెవెల్. ఇప్పటికీ యూట్యూబ్ లో ఎక్కువ మంది చూసిన తెలుగు పాట ఇదే. ఐదేళ్లలో ఏకంగా 91 కోట్లకుపైగా వ్యూస్. తమన్ కంపోజ్ చేసిన ఈ పాట లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం.

అల వైకుంఠపురంలోని బుట్టబొమ్మ పాటను అర్మాన్ మాలిక్ పాడాడు. తమన్ మ్యూజిక్ అందించగా.. రామజోగయ్య శాస్త్రి పాట రాశాడు. ఈ సాంగ్ పై అల్లు అర్జున్ వేసిన స్టెప్స్ కూడా అదుర్స్ అనిపించేలా ఉంటాయి. దీంతో ఈ వీడియో సాంగ్ అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న తెలుగు పాటగా చరిత్ర సృష్టించింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కూడా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాలోనిదే రాములో రాములా పాట కూడా యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్...