భారతదేశం, నవంబర్ 10 -- బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరు మరింత ఆసక్తిగా మారుతోంది. మొదటి దశలో రికార్డు స్థాయిలో 65.08 శాతం పోలింగ్ నమోదు కాగా, నవంబర్ 11న రెండో దశ పోలింగ్ జరగనుంది. ఈ దశలో మొత్తం 20 జిల్లాల పరిధిలోని 122 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. 3 కోట్ల 70 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఈ రెండో దశ ఎన్నికలే.. బీహార్‌లో అధికారం ఎవరికి దక్కుతుందో నిర్ణయించే అత్యంత కీలకంగా మారాయి. ఇక్కడ ప్రధాన పార్టీల కంటే కూడా, వారి మిత్ర పక్షాల ప్రదర్శనే ఫలితాలను తారుమారు చేయనుంది. ఈ దశలో చిన్న పార్టీలకు ఎక్కువ సీట్లు కేటాయించడం, వాటిపై అధికారం ఆధారపడి ఉండడం ఈ ఎన్నికల్లో కీలక అంశం.
ఎన్డీయే కూటమిలో ఈసారి చిన్న పార్టీలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా దళిత, బీసీ వర్గాల నేతలకు కేటాయించిన సీట్లలో గెలుపు కీలకంగా మార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.