భారతదేశం, నవంబర్ 14 -- బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెలువడనున్నాయి. తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం సహా వివిధ రాష్ట్రాల్లో 8 ఉప ఎన్నికలకు నేడు ఫలితం వెలువడనుంది.

బీహార్ అసెంబ్లీలోని 243 సీట్లలో 122 సీట్ల మెజారిటీ కోసం ఎన్డిఎ, మహాకూటమి పోటీ పడ్డాయి. పోలింగ్ కూడా భారీగా నమోదైంది. అయితే బీహార్ లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారాన్ని నిలుపుకునే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ తామే గెలుస్తామని మహా కూటమి గట్టిగా విశ్వసిస్తోంది.

బీహార్ ఎన్నికల్లో ఎన్డీయేలో బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మోర్చా ఉన్నాయి. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిలో కాంగ...