Andhrapradesh,amaravti, సెప్టెంబర్ 27 -- రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా త్వరలో సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో వివిధ పోటీ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ అందజేయనున్నట్లు తెలిపారు.

శుక్రవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నాలుగో బ్లాక్ లో మంత్రి సవితను ఏపీ బీసీ స్టడీ సర్కిల్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. బీసీ సంక్షేమ శాఖకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు వచ్చినందుకు గానూ మంత్రిని వారు సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ. ఉచిత సివిల్స్ కోచింగ్ పై ప్రకటన చేశారు.

రాబోయే రోజుల్లో వివిధ పోటీ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందజేయనున్నట...