భారతదేశం, డిసెంబర్ 27 -- వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 విద్యా సంవత్సరంలో భాగంగా పీఎం యశ్వసి పథకం కింద రెండో విడతగా కళాశాల, పాఠశాల ఓబీసీ, ఈబీసీ, డీఎన్టీ విద్యార్థులకు స్కాలర్ షిప్పుల నిమిత్తం రూ.90.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత వివరాలను ప్రకటించారు.

2025-26 విద్యా సంవత్సరానికి గానూ రెండో విడతగా రూ.69.40 కోట్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు కోసం కూటమి ప్రభుత్వం మంజూరు చేసినట్లు మంత్రి సవిత పేర్కొన్నారు. ఈ నిధులు కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న బీసీ, ఈబీసీ, డీఎన్‌టీ విద్యార్థులకు ఉపకరిస్తాయన్నారు. ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు గానూ రెండో విడతగా రూ. 21.10 కోట్లను విడుదల చేసిందన...