Telangana,hyderabad, అక్టోబర్ 9 -- బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధిస్తూ తీర్పునివ్వటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని ఓ ప్రకటన ద్వారా తెలిపింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పాడినట్లు అయింది.

జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం ఏం చేయబోతోంది.? అనేది ఉత్కంఠగా మారింది. సుప్రీంకోర్టుకి వెళ్లి హైకోర్ట్‌ ఇచ్చిన స్టేను వెకేట్‌ చేయిస్తుందా లేక పాత రిజర్వేషన్లతో మరో నోటిఫికేషన్‌ ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇవన్నీ కాకుండా హైకోర్టులో కేసు తేలేవరకు ఎన్నికలు వాయిదా వేస్తుందా అనేది ప్రశ్నగా మారింది.

రేపు తెలంగాణకు బంద్ కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకటన చేశారు. జీవో పేరుతో బీసీలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలన...