భారతదేశం, సెప్టెంబర్ 27 -- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరింది. జస్టిస్‌ అభినందన్‌ కుమార్‌ శావిలి, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారించగా.. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేసింది.

గవర్నర్‌ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు జీవో ఎలా ఇస్తారు? అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. గవర్నర్‌ దగ్గర బిల్లు పెండింగ్‌ ఏ స్టేజ్‌లో ఉందని ఏజీనీ అడిగింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఉండాలి అనే నిబంధన ఉంది కదా అని గుర్తు చేసింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హడావుడిగా.. బీసీ రిజర్వేషన్లపై జీవో విడుదల చేయడం ఎందుకని అడిగింది. అవసరమైతే మరో 3 నెలల సమయం పడుతుందని మెమో వేయొచ్చు కదా అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

బీసీ రిజర్వేషన్ల జీవోను రద్దు చేయాలని కోరుతూ మాధవరెడ్డి అనే వ...