Telangana,hyderabad, అక్టోబర్ 9 -- తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 57.6 శాతం బీసీ జనాభా ఉందని తేలిందని ఏజీ వాదనలు వినిపించారు. "బీసీ జనగణన శాస్త్రీయంగా నిర్వహించాం. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలపలేదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్టే" అని వాదనలు వినిపించారు.

రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వ సూచనలను హైకోర్టుకి తెలియచేస్తున్నారు. ఒకవేళ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి ఉంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసి ఉండేదని చెప్పారు. గవర్నర్‌ గడువులోగా ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుందని. ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ఇవాళ కూడా ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ ...