Telangana,hyderabad, అక్టోబర్ 9 -- బీసీ రిజర్వేషన్లపై జీవోపై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం. జీవో 9పై స్టే విధించింది.4 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల నోటిఫికేషన్‌ పై కూడా న్యాయస్థానం స్టే విధించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలుకు రెండు వారాల్లో కౌంటర్‌ వేయాలని పిటిషనర్లను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడినట్లు అయింది. హైకోర్టు ఆర్డర్‌ పరిశీలించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

అంతకుముందు ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. బీసీ జనగణన చేయాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని వివరించారు. అసెంబ్లీ కూడా బీసీ జనగణన చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసి...