భారతదేశం, జూలై 8 -- వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ ఈనెల 17న 'రైల్ రోకో' ఆందోళన చేపట్టనున్నట్ట తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత ప్రకటించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే దీనికి సంబంధించిన బిల్లులను రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. అయితే కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో కవిత కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు పెండింగ్‌లో ఉండటంపై ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు.

తెలంగాణ శాసనసభ ఈ ఏడాది మార్చి 17న రెండు బిల్లులను ఆమోదించింది. వీటి ప్రకారం, విద్యా సంస్థలలో, ఉద్యోగాలలో, అలాగే గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 23 శాతం నుండి 42 శాతానికి పెంచాలని ప్రతిపాదిం...