Telangana,hyderabad, జూలై 11 -- తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఓవైపు ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకువేస్తుండగా. మరోవైపు ఏర్పాట్ల ప్రక్రియపై ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే. షెడ్యూల్ విడుదల చేసేందుకు సిద్ధమైంది.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఈసారి పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకునే పనిలో పడింది. అయితే అధికారంలోకి రాకముందు నుంచే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన ఆ పార్టీ.. కామారెడ్డిలో డిక్లరేషన్ కూడా చేసింది. కులగణన, బీసీ కమిషన్‌ నివేదిక ఆధారంగా బీసీల రిజర్వేషన్లను పెంచుతామని ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా.. అధికారం...