భారతదేశం, అక్టోబర్ 8 -- తెలంగాణ హైకోర్టులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల మీద విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం, పిటిషనర్ల తరఫు న్యాయవాదులు బలంగా వాదనలు వినిపించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ జారీ మీద స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అయితే దీనిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు వింటామని సీజే జస్టిస్ ఏకే సింగ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. రిజర్వేషన్ల మీద ప్రభుత్వం జీవో నెంబర్ 9 జారీ చేయగా.. దీన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఆర్.కృష్ణయ్య, వి.హనుమంతరావుతోపాటుగా మరికొందరు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు.

రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నా 50 శాతానికి మించరాదు. విద్య, ఉద్యోగాల్లో 50శాతం దాటినా రాజకీయ రిజర్వే...