భారతదేశం, జూలై 29 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆగస్టు 5, 6, 7వ తేదీల్లో మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనున్నారు. వెనుకబడిన తరగతుల (బీసీ) వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లకు తక్షణ కేంద్ర ఆమోదం కోరుతూ నిరసనలు చేపడతారు. ఇందులో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్‌మెంట్‌ కూడా తీసుకోనున్నారు.

రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో కూడిన ప్రతినిధి బృందం, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవాలని యోచిస్తోంది. రాష్ట్రపతి భవన్ వద్ద పెండింగ్‌లో ఉన్న తెలంగాణ బీసీ కోటా బిల్లులను ఆమోదించాలని కోరుతారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను ఖరారు చేయడానికి తెలంగాణ హైకోర్టు విధించిన గడువు జూలై 25తో ముగిసినందున ఈ సమస్య అత్యవసరంగా మారింది. స్థానిక సంస్థల్లో 42 శాతం క...