Hyderabad, ఆగస్టు 29 -- బీర్ కేవలం మందు కాదు అదో ఎమోషన్ అంటోంది తమన్నా భాటియా. ఆమె నటించిన డూ యూ వానా పార్ట్‌నర్ (Do You Wanna Partner) వెబ్ సిరీస్ ట్రైలర్ శుక్రవారం (ఆగస్టు 29) రిలీజైంది. ఇందులో తప్పతాగి జాబ్ కోల్పోయే ఆమె.. తన పార్ట్‌నర్ తో కలిసి సొంతంగా బీరు తయారీ బిజినెస్‌లోకి దిగడం చూడొచ్చు. ఈ సిరీస్ సెప్టెంబర్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

డూ యూ వానా పార్ట్‌నర్ వెబ్ సిరీస్ లో తమన్నా భాటియా, డయానా పెంటీ నటిస్తున్నారు. శుక్రవారం (ఆగస్టు 29) ప్రైమ్ వీడియో ఇండియా ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ఇద్దరు నటీమణులు ఫ్రెండ్స్ నుండి బిజినెస్ పార్ట్‌నర్స్‌గా మారి ఒక బీర్ బ్రాండ్ ను సక్సెస్‌ఫుల్ స్టార్టప్‌గా చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వాళ్లు ఎదుర్కొనే సవాళ్లను ఈ ట్రైలర్ లో చూపించారు.

ట్రైలర్ మొదట్లోనే బీర్ క...