భారతదేశం, డిసెంబర్ 17 -- భారతదేశ బీమా రంగం (Insurance Sector) ఒక సరికొత్త శకంలోకి అడుగుపెట్టబోతోంది. 2047 నాటికి దేశంలోని ప్రతి పౌరుడికీ బీమా రక్షణ కల్పించాలనే ('Insurance for All') లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'సబ్ కా బీమా-సబ్ కా రక్ష (బీమా చట్టాల సవరణ) బిల్లు, 2025'ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దశాబ్దాల కాలంలో ఈ రంగంలో రాబోతున్న అతిపెద్ద సంస్కరణగా దీన్ని నిపుణులు అభివర్ణిస్తున్నారు.

ప్రధానంగా 1938 నాటి బీమా చట్టం, 1956 నాటి ఎల్ఐసీ (LIC) చట్టం, 1999 నాటి ఐఆర్డీఏఐ (IRDAI) చట్టాల్లో కీలక మార్పులు చేస్తూ ఈ బిల్లును రూపొందించారు.

కేవలం పెట్టుబడులే కాకుండా, సామాన్య పాలసీదారుడికి గరిష్ట ప్రయోజనం చేకూర్చేలా ఇందులో పలు మార్పులు చేశారు:

100% విదేశీ పెట్టుబడులు (FDI): ప్రస్తుతం బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితి 74 శాతంగా ఉంది. దీన్ని 100 శాతా...