Telangana,hyderabad, జూలై 31 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీట్ల భర్తీ కొనసాగుతోంది. ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టారు. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి కాగా... థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది.

టీజీ ఈఏపీసెట్ థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ఆగస్ట్ 5వ తేదీ నుంచి షురూ అవుతాయి. అర్హులైన అభ్యర్థులు https://tgeapcet.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. ఆగస్ట్ 6వ తేదీ ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఆగస్ట్ 6 నుంచి 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఆగస్ట్ 7వ తేదీన వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ఉంటుంది. ఆగస్ట్ 10వ తేదీలోపు సీట్ల కేటాయింపు ఉంటుంది.

టీజీ ఈఏపీసెట్ థర్డ్ ఫేజ్ కింద సీట్లు పొందిన అభ్యర్థులు... ఆగస్ట్ 10 నుంచి ట్యూషన్ ఫీజు, సె...