భారతదేశం, జూన్ 23 -- బీటీఎస్ గ్రూప్ సభ్యుడు సుగా (అసలు పేరు మిన్ యూన్-గి) దక్షిణ కొరియాలోని ఒక ఆటిజం ఆసుపత్రికి 500 కోట్ల వోన్ (దాదాపు $3.6 మిలియన్లు.. భారత కరెన్సీలో సుమారు 31.23 లక్షల రూపాయలు) విరాళంగా ఇచ్చి రికార్డు సృష్టించాడు. సామాజిక సేవ నుంచి తిరిగి వచ్చిన కొన్ని రోజులకే ఆయన ఇంత పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇవ్వడం విశేషం. కొరియా జూంగాంగ్ డైలీ పత్రిక ప్రకారం, సెవెరెన్స్ ఆసుపత్రిలో మిన్ యూన్-గి సెంటర్ ఏర్పాటు చేయడానికి సుగా ఈ విరాళం ఇచ్చారు. ఒక కే-పాప్ ఐడల్ ఇంత పెద్ద మొత్తాన్ని ఒకేసారి ఆసుపత్రికి విరాళంగా ఇవ్వడం ఇదే మొదటిసారి.

ఆటిజంతో బాధపడే పిల్లలు, టీనేజర్లకు సాయం చేయడంలో సుగా చాలా ఆసక్తి చూపారని, ముఖ్యంగా వాళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లకుండా చూడటంలో, సంగీతం ఎలా ఉపయోగపడుతుందనే దానిపై ఆయనకు ప్రత్యేక శ్రద్ధ ఉందని సెవెరెన్స్ ఆసుపత్రి చెప్పి...