భారతదేశం, ఏప్రిల్ 23 -- ఏపీలో మాజీ వైసీపీ ఎంపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం బీజేపీకి దక్కనుంది. ఈ మేరకు కూటమి పార్టీల మధ్య ఇప్పటికే అవగాహన కుదిరింది. మంగళవారం ఢిల్లీలో రాజ్యసభ అభ్యర్థిత్వంపై బీజేపీ అగ్రనేతలతో జరిగిన చర్చల్లో ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది.

మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజ్యసభ అభ్యర్థి విషయంపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడింది. దీంతో బీజేపీ తరపున ఎవరు పోటీ చేస్తారనే ఆసక్తి నెలకొంది. తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అన్నామల...