Telangana, మే 29 -- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా పోటీ చేసినప్పుడు తనపై కొందరు వ్యతిరేకంగా ప్రచారం చేశారన్నారు. సొంత పార్టీ వాళ్లే ఓడించారని ఆరోపించారు. గురువారం మీడియాతో చిట్ చాట్ చేసిన ఆమె.. పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తన లేఖను లీక్ చేసింది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు.

"సొంత బిడ్డపై మీ ప్రతాపం ఏంటి.? బయట వాళ్లపై ఎందుకు మాట్లాడటం లేదు..? ఇదేనా పార్టీని నడిపించడం.? సభను సక్సెస్ చేసింది కేసీఆర్ మాత్రమే ప్రతిదీ ఆయనే చూసుకున్నారు. గంపగుత్తగా బీజేపీకి అంట గట్టేలాగా వ్యవహారం చేస్తున్నారు. బీజేపీ కోవర్ట్లు మనదాంట్లో ఎవరు ఉన్నారు మరీ.?" అని కవిత ప్రశ్నించారు.

"నేను పదవి అడగలేదు, పైసలు అడగలేదు. వెన్నుపోటు రాజకీయం చేయను , చేయలేదు. ఎంపీగా పోటీ చేసినప్పుడు నాపై కొందరు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. జాగృతిని సొంత ...