భారతదేశం, డిసెంబర్ 15 -- భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లోని అత్యున్నత నాయకత్వంలో కీలకమైన సంస్థాగత మార్పు చోటుచేసుకుంది. పార్టీ తదుపరి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్​గా (కార్యనిర్వాహక అధ్యక్షుడు) బీహార్​కి చెందిన నితిన్ నబిన్‌ను నియమించారు.

ప్రస్తుత జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రిగా ఉన్న జేపీ నడ్డా స్థానంలో నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ సందర్భంగా, కొత్తగా నియమితులైన నితిన్ నబిన్ ప్రస్తానం గురించి ఇక్కడ తెలుసుకోండి..

నితిన్ నబిన్ 1980లో బిహార్​లోని పట్నాలో జన్మించారు. ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని బీజేపీ విద్యార్థి విభాగమైన అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ద్వారా ప్రారంభించారు.

2000 సంవత్సరంలో తొలిసారిగా బీహార్ అసెంబ్లీకి ఎన్నికైన నబిన్, ప్రస్తుతం పట్నాలోని బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యే...