భారతదేశం, జనవరి 2 -- ప్రపంచమంతా కొత్త ఏడాది వేడుకల్లో, పార్టీల్లో మునిగితేలుతుంటే.. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి మాత్రం ప్రశాంతతను కోరుకున్నారు. ఆర్భాటాలకు దూరంగా, తమ ముద్దుల కూతురు 'ఇవారా' (Evaarah) తో కలిసి సముద్రపు అలల సాక్షిగా 2026కి స్వాగతం పలికారు.

ఈ బీచ్ వెకేషన్‌కు సంబంధించిన కొన్ని అందమైన ఫోటోలను అతియా శెట్టి గురువారం (జనవరి 1) ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. "2026.. మా హృదయాలు నీకోసం వేచి చూస్తున్నాయి" అనే అర్థం వచ్చేలా అతియా శెట్టి పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సముద్రపు నీటి అంచున నిలబడి ఉన్న ఈ జంట, తమ చిన్నారిని ఎత్తుకుని ప్రకృతిని ఆస్వాదిస్తున్న దృశ్యం నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఇదిలా ఉంటే, ఒక ఫోటోలో కేఎల్ రాహుల్ క్యాజువల్ టీ-షర్ట్, షార్ట్స్‌లో కనిపిస్తుండగా,...