భారతదేశం, జూలై 23 -- కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి బీఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. bsf.gov.in నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ రిక్రూట్మెంట్ కోసం అభ్యర్థులు ఆగస్టు 25, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ రిక్రూట్‌మెంట్ కింద 3588 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్‌కు జూలై 26 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.

ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌పేపర్‌లో ప్రచురించిన సంక్షిప్త నోటిఫికేషన్ ప్రకారం 3588 పోస్టులలో 3406 ఖాళీలు పురుష అభ్యర్థులకు, 182 ఖాళీలు మహిళా అభ్యర్థులకు. ఈ ఖాళీలు కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ కేటగిరీ కింద వివిధ ట్రేడ్‌లలో ఉంటాయి. అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో విడుదల కానున్న పూర్తి నోటిఫికేషన్‌లో పోస్టుల గురించి పూర్తి సమాచారం అందుబాటులో ఉ...