భారతదేశం, ఫిబ్రవరి 24 -- ప్రైవేట్ టెలికాం కంపెనీలతో బీఎస్ఎన్ఎల్ పోటీ పడుతూ మంచి మంచి రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తుంది. ప్రైవేట్ కంపెనీలు తమ టారిఫ్‌లను పెంచుతున్నందున బీఎస్‌ఎన్‌ఎల్ సరసమైన ప్లాన్‌లను అందిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. బీఎస్ఎన్ఎల్ 150 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ కలిగి ఉంది.

బీఎస్ఎన్ఎల్ రూ.397 రీఛార్జ్ ప్లాన్ ఆఫర్ 150 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ వంటి ముఖ్యమైన సేవలను అందిస్తుంది. ఇది దీర్ఘకాల చెల్లుబాటును కలిగి ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్. మీరు మీ సిమ్‌ను తరచుగా రీఛార్జ్ చేసుకోవడంతో ఇబ్బందిపడితే.. ఈ ప్లాన్ మీకు సరైనది. ఇది అదనపు రీఛార్జ్‌లు అవసరం లేకుండా మీ బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను ఐదు నెలల పాటు యాక్టివ్‌గా ఉంచుతుంది.

మొదటి 30 రోజులు అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత ఉచిత కాల్స్. ఆ తరువాత అవుట్‌గోయి...