భారతదేశం, ఆగస్టు 16 -- టీజీ ఎడ్ సెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఆగస్ట్ 10వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్లను కూడా కేటాయించారు. అయితే ఈ విడతలో సీట్లు పొందిన వారు ఆగస్ట్ 14వ తేదీలోపే రిపోర్టింగ్ చేయాల్సి ఉంది. అయితేఈ విషయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో ఎడ్‌సెట్‌ రిపోర్టింగ్ తేదీల గడువును పొడిగించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్ట్ 20వ తేదీ వరకు రిపోర్టింగ్ చేసుకునే వీలును కల్పించారు. రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో 14,295 సీట్లు ఉండగా.. ఫస్ట్ ఫేజ్ కింద 9 వేల మందికిపైగా అభ్యర్థులకు సీట్లను కేటాయించారు. వీరంతా కూడా ఆగస్ట్ 20లోపు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

తెలంగాణ ఎడ్‌సెట్‌ పరీక్షలు జూన్‌ 1వ తేదీన జరిగాయి. మొదటి షెషన్‌ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షను నిర్వహిం...