భారతదేశం, ఆగస్టు 27 -- టీజీ ఎడ్ సెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తి కాగా. అధికారులు సెకండ్ ఫేజ్ షెడ్యూల్ ను ప్రకటించారు. ఇందులో భాగంగా ఎంట్రెన్స్ టెస్ట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులు. ఆగస్ట్ 29 నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.

ఆగస్ట్ 10వ తేదీన ఎడ్ సెట్ ఫస్ట్ ఫేజ్ సీట్లను కూడా కేటాయించారు. అయితే ఈ విడతలో సీట్లు పొందిన వారు ఆగస్ట్ 20వ తేదీ వరకు రిపోర్టింగ్ చేసుకున్నారు. రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో 14,295 సీట్లు ఉండగా.. ఫస్ట్ ఫేజ్ కింద 9 వేల మందికిపైగా అభ్యర్థులకు సీట్లను కేటాయించారు.

తెలంగాణ ఎడ్‌సెట్‌ పరీక్షలు జూన్‌ 1వ తేదీన జరిగాయి. మొదటి షెషన్‌ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షను నిర్వహించారు. ఈసారి జరిగిన ఎడ్‌సెట్‌ కు 38,754 మంది దరఖాస్తు చేసుకోగ...