Hyderabad, మే 16 -- బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ కుటుంబంలో పార్టీ పగ్గాలను చేపట్టే విషయంలో బయటకు కనిపించని పోరు సాగుతోందని కేటీఆర్‌, కవితల మధ్య దూరం పెరుగుతోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీలో పక్కన బెట్టేందుకు సొంత సోదరుడు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు బీఆర్‌ఎస్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

కేసీఆర్‌ కుటుంబానికి సన్నిహితంగా ఉండే పార్టీ నాయకుడు ఒకరు ఇప్పటికే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ పార్టీని నియంత్రించడం ప్రారంభించారని, కేసీఆర్ పార్టీ రోజువారీ కార్యకలాపాలలో దాదాపుగా చురుకుగా పాల్గొనడం ఆపేశారని వివరించారు.

"కేటీఆర్ త్వరలోనే బీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించవచ్చని, కేసీఆర్ రానున్న కాలంలో జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్ జాతీయ పార్టీ అధ్యక్షుడిగ...