భారతదేశం, డిసెంబర్ 17 -- పంచాయతీ నిధులు సర్పంచ్‌ల హక్కు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ సర్పంచ్‌లకు నిధులివ్వకుంటే తాటతీస్తామని హెచ్చరించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఖానాపూర్, షాద్‌నగర్ నియోజకవర్గ నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార మదం తలకెక్కిందని. ప్రజలను మరియు ప్రజాప్రతినిధులను చంపేస్తామంటూ బరితెగించి మాట్లాడుతున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

"కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అయితే 'నన్ను ఓడించి చంపేస్తే.. నేను మిమ్మల్ని గెలిచి చంపేస్తా' అని బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు. ఎమ...