భారతదేశం, ఏప్రిల్ 28 -- బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి 25 ఏండ్లయిన సందర్భంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన భారీ బహిరంగ సభ జనసమూహంగా విజయవంతమయినా, వేదిక నుండి పార్టీ శ్రేణులకు సరైన సందేశం ఇవ్వకుండా దశ దిశ లేని సభగా ముగిసింది. సభలో ఏకైక వక్త అయిన పార్టీ చీఫ్‌ కేసీఆర్‌ నుండి రావాల్సిన పంచ్‌లు రాలేదు. ఆయన హాహాభావాల్లో కూడా మునుపటి వేడి కనిపించలేదు. ఇటు కాంగ్రెస్‌, అటు బీజేపీపై సమాన స్థాయిలో విమర్శల వాన కురిపిస్తారని భావించినా తేడా కనిపించింది. పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఎజెండా నిర్ణయిస్తారనుకున్నా బీఆర్‌ఎస్‌లో ఆ ఉత్సాహం ఎక్కడా కనిపించ లేదు.

ఎల్కతుర్తి సమావేశం కోసం బీఆర్‌ఎస్‌ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామల నుండి ఎంతో ఉత్సాహంగా తరలి వచ్చారనడంలో ఎలాంటి సందేహాలు లేవు. పెద్దఎత్తున జనప్రవాహం ఉన్నా సభ వేదికపై కేసీఆర్‌లో తడబాటు కనిపించి...