భారతదేశం, మే 4 -- కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని ఎల్కతుర్తి వద్దే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుక జరిగింది. ఆ బహిరంగ సభ విజయవంతం అయ్యింది. అయితే.. తెరవెనుక ఏసీపీ, కొంతమంది పోలీస్ అధికారులు కూడా సభ సక్సెస్‌కు సహకరించారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో సభ జరిగిన నాలుగు రోజుల వ్యవధిలోనే అనూహ్యంగా కాజీపేట ఏసీపీని బదిలీ చేశారనే చర్చ నడుస్తోంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కాంక్షతో 2001 ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. పార్టీ ఏర్పడి 25 ఏళ్లలోకి అడుగుపెట్టిన సందర్భంగా.. రజతోత్సవ సభకు ప్లాన్ చేసింది. ఈ మేరకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సభ నిర్వహణకు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి మండలాన్ని సెలెక్ట్ చేశారు. ఎల్కతుర్తి -చింతలపల్లి గ్రామాల మధ్యలో సుమారు 1,250 ఎకరాల్లో.. దాదాపు 10 లక్షల మంది టార్గెట్ గా సభ నిర్వహించారు. పార్ట...