Warangal,elkathurthy, ఏప్రిల్ 26 -- బీఆర్ఎస్ రజతోత్సవానికి పార్టీ నేతలు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్టీ ఏర్పడి పాతికేళ్ల పడిలోకి అడుగు పెడుతుండటంతో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ అధినేత ఆదేశాలతో ఉమ్మడి మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు జంక్షన్ గా ఉన్న ఎల్కతుర్తిని సభ నిర్వహణకు ఎంపిక చేసి, జన సమీకరణపై ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, వొడితల సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో ఇప్పటికే పార్కింగ్ ఏర్పాట్లతో పాటు సభా వేదికను ముస్తాబు చేశారు.

పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికిపైగా జనాలను తరలించేందుకు గులాబీ నేతలంతా ప్లాన్ చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జన...