భారతదేశం, ఏప్రిల్ 25 -- ఎల్కతుర్తిలో జరిగే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభా ప్రాంగణానికి చేరుకునేలా జోన్లవారీగా రూట్‌ మ్యాప్‌లను సిద్ధం చేశారు. 5 జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణానికి మొత్తం నాలుగు రహదారుల ద్వారా వాహనాలు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అందులో మూడు జాతీయ రహదారులు సహా.. సభ జరిగే చింతలపల్లికి చేరుకునేలా ధర్మసాగర్‌ నుంచి వచ్చే మరో రూట్‌ను కూడా సిద్ధం చేశారు.

వరంగల్‌ నుంచి.. ఇది 163వ జాతీయ రహదారి. ఈ రూట్‌ గుండా వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలు సహా హైదరాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ శ్రేణులు వచ్చే అవకాశం ఉంది.

సిద్దిపేట-హుస్నాబాద్‌ నుంచి.. ఇది 765వ డీజీ జాతీయ రహదారి. ఈ రూట్‌ నుంచి మెదక్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలు సహా వెస్ట్‌ ఆదిలాబాద్‌.. (ఆదిలాబాద్‌, నిర్మల్‌, బోథ్‌, ఖానాపూర్‌ నియోజక వర్గాలు) నుంచి ...